నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా విశ్వకర్మకు ప్రత్యేక అభిషేకాలు,అర్చనలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.భక్తులకు తీర్థప్రసాదాలు అందించడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కలిసి సంఘం జెండాను ఆవిష్కరించారు. జై విశ్వకర్మ విశ్వబ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ చేసిన నినాదాలతో తాడిచెర్ల పురవీధులు మారుమోగాయి.సమాజ నిర్మాణంలో, సాంకేతిక అభివృద్ధిలో విశ్వకర్మ వంశస్థుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.సాంకేతిక రంగానికి మూలపురుషుడైన విశ్వకర్మ భగవానుని ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా,ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సాధించుకోవాలంటే విశ్వబ్రాహ్మణ ఉపకులాలు, సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.ఐక్యత ద్వారానే హక్కుల సాధన సాధ్యమవుతుందని, సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, కుల పెద్దలు కందుకూరి మొగిలి చారి, ఒజేల రాజబాబు చారి, ఉట్నూరీ రవి చారి, ఒజేల చంద్రచారి, అనసూరి మొండయ్య చారి, పోలోజు రాముచారి, ఒజేల శంకరయ్య చారి, అనసూరి రమేష్ చారి, నూతి శ్రీకాంత్ చారి, పోలోజు కృష్ణమాచారి, నూతి సతీష్ చారి, నూతి సంతోష్ చారి, నూతి నరేష్ చారి, నూతి మహేష్ చారి తదితరులతో పాటు మండల, గ్రామ కమిటీల బాధ్యులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



