నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు సత్తుపల్లి సింగరేణి ఏరియాలో ‘ప్రజాపాలన దినోత్సవ వేడుకను’ గురువారం ఘనంగా నిర్వహించారు. జనరల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సత్తుపల్లి ఏరియా జీఎం సరికొండ వెంకటచారి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం వెంకటచారి మాట్లాడుతూ… అందరికీ ప్రజాపాలన దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. సంస్థ ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో ఉద్యోగులు, అధికారులు క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలని జీఎం కోరారు. ‘ఎస్ ఓ టు జీఎం’ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్. సుధాకర్, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ బి. కోటేశ్వరరావు, సీఎంఓఏఐ సత్తుపల్లి ఏరియా ప్రెసిడెంట్ సునీల్ వర్మ, ఏరియా ఇంజనీర్, పర్చేస్ ఆఫీసర్, వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
సత్తుపల్లి సింగరేణిలో ‘ప్రజాపాలన దినోత్సవ’ వేడుక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



