నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికాతో యుద్ధంలో అనేక మంది ఇరాన్ సైనికులు అమరులైనారు. వారి త్యాగాలకు జ్ఞాపకార్థంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ‘ఇరాన్ కోసం త్యాగం’ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడిన అధ్యక్షుడు.. దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరాన్ దేశ గౌరవాన్ని కాపాడడమనేది పౌరులందరికీ చెందుతుంది. ఇందుకు ప్రజల భాగస్వామ్యం, ఐక్యత చాలా అవసరం అని పెజెష్కియాన్ అన్నారు. ప్రతీ విషయంలోనూ ఇరాన్ ప్రజలు చూపే ఐక్యతే శత్రు దేశాల కుట్రలను భగ్నం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, ఐక్యత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
అమెరికా జరిపిన దాడుల్లో మరణించిన వారికి ప్రజలు నివాళులర్పించారు. అలాగే యుద్ధ వీరులు, నూతన వధూవరులు, ఇరాన్ సైనిక విభాగాలు, మహిళలు, యెమెన్ జాతీయులు కూడా ఈ కవాతులో పాల్గొన్నారని ఆదేశ ప్రెస్ టీవీ పేర్కొంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఇరాన్ డ్రోన్‌లను ప్రదర్శించినట్లు ప్రెస్ టీవీ పేర్కొంది.



