Friday, September 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవిమానంలో ఇద్దరు యువకుల హాల్ చల్

విమానంలో ఇద్దరు యువకుల హాల్ చల్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ‘బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌’ విమానంలో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. లండన్‌ నుంచి బంగ్లాదేశ్‌కు విమానంలో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా కొట్టుకున్నారు. తొలుత మొదలైన వాగ్వాదం కాస్తా భౌతిక దాడికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా బస్సులోనో లేదంటే రైల్లోనో ప్రయాణికులు గొడవ పడడం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ విమానంలో ఘర్షణకు దిగడం మాత్రం చాలా అరుదు.

https://twitter.com/i/status/2100756111670329677

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -