Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం పడింది. నగరంలోని ఎల్బీ నగర్, వనస్థలిపురం, తార్నాక, సికింద్రాబాద్, ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి,  టోలిచౌకి, షేక్ పేట్, ఓయూ కాలనీ, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, నల్లకుంట, విద్యానగర్ లో వాన జోరుగా కురిసింది. సరిగ్గా ఆఫీసులు, విద్యాసంస్థలు మూసి ఇంటికి వెళ్లే సమయంలోనే వర్షం కురువడంతో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నీరు నిలిచే ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -