- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి డివిజన్లోని గోపన్‌పల్లిలో ప్రమాదకరంగా ఒరిగిన నాలుగంతస్తుల భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు శనివారం కూల్చివేత పనులు మొదలుపెట్టారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన ఈ భవనం శుక్రవారం ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో స్థానికులు భయాందోళనకు గురై అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఎలాంటి ప్రమాదం జరగకుండా చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించి క్రేన్ సహాయంతో కూల్చివేత పనులు చేపట్టారు.
- Advertisement -



