- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 25న, శుక్రవారం రోజున గణనాథుడిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. అనంత చతుర్దశి పర్వదినం సెప్టెంబర్ 25న రావడంతో, అదే రోజు నిమజ్జన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు “శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి”గా భక్తులకు దర్శనమిస్తుండడం తెలిసిందే. ప్రతి ఏటా 11 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు, ఈసారి ఒక రోజు అదనంగా 12 రోజుల పాటు కొనసాగనుండటం విశేషం. దీంతో భక్తులకు స్వామి వారిని దర్శించుకునేందుకు అదనపు సమయం లభించనుంది.
- Advertisement -


