జియుక్వాన్ (చైనా) : షాన్సీ రాష్ట్రంలోని డాంగ్‌ఫెంగ్ వాణిజ్య ఆవిష్కరణల పైలట్ జోన్ నుంచి ఆదివారం మధ్యాహ్నం బీజంగ్ కాలమానం ప్రకారం 12.03 గంటలకు (బీజింగ్ సమయం) చైనా తొమ్మిది ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఉపగ్రహాల సమూహం పీశాట్ – 2 13 – 16ను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన లిజియాన్ – 1వై18 క్యారియర్ రాకెట్ వాటిని ముందుగా నిర్దేశించిన ప్రణాళికాబద్ధమైన కక్ష్యలలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం లాంగ్ మార్చ్ క్యారియర్ రాకెట్ శ్రేణిలో 668వది. రెండు దశల ద్రవ ప్రయోగ వాహనమైన ఈ రాకెట్ 700 కిలోమీటర్ల సూర్య – సమకాలీన కక్ష్య (భూమి చుట్టూ ఉండే ప్రత్యేకమైన అంతరిక్ష కక్ష్య. ఈ కక్ష్యలో తిరిగే ఉపగ్రహం భూమిపై ఉన్న ఏ ప్రాంతం మీదుగా వెళ్లినా ప్రతి రోజూ ఒకే స్థానిక సౌర సమయానికి ఆ ప్రాంతాన్ని దాటుతుంది)లో 1.3 టన్నుల బరువును మోయగలదు. రాకెట్లో బీజింగ్‌కు చెందిన ప్రయివేటు ఉపగ్రహ తయారీ సంస్థ గెలాక్సీస్పేస్ అభివృద్ధి చేసిన నాలుగు సింథటిక్ అపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) ఉపగ్రహాలు ఉన్నాయి.
చైనా ఉపగ్రహాల ప్రయోగం సక్సెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



