సీఎఫ్డీఏ చైర్మెన్ రాజీనామా
వాషింగ్టన్ : అమెరికా ఫ్యాషన్ డిజైనర్స్ కౌన్సిల్ (సీఎఫ్డీఏ) అధిపతి స్టీవెన్ కోల్బ్ తన పదవికి రాజీనామా చేశారు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ రన్‌వే ప్రదర్శనకు హాజరు కాకుండా జంతు హక్కుల కార్యకర్తలను భౌతికంగా అడ్డుకున్నారంటూ ఆరోపణలు వచ్చిన కొద్ది రోజులకే ఆయన తన పదవికి రాజీనామా సమర్పించారు. సీఎఫ్డీఏకు ఇరవై సంవత్సరాల పాటు నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత సీఈఓ, చైర్మెన్ పదవులకు రాజీనామా చేయాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. సీఎఫ్డీఏ అనేది అమెరికాలోని ప్రముఖ ఫ్యాషన్ పరిశ్రమకు చెందిన వాణిజ్య గ్రూప్. ఇది న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌ను నిర్వహిస్తుంది. స్వచ్ఛందంగా సెలవు తీసుకుంటున్నానని కోల్బ్ చెప్పిన తర్వాత సీఎఫ్డీఏ ఓ ప్రకటన విడుదల చేస్తూ మండలి బోర్డు పూర్తి స్థాయి సమీక్ష జరిపే వరకూ కోల్బ్ సెలవులో ఉంటారని తెలియజేసింది. ఫ్యాషన్ షోలో ఉన్ని వాడకంపై నిరసన వ్యక్తం చేసిన ఇద్దరు కార్యకర్తలపై కోల్బ్ దురుసుగా ప్రవర్తించారు. ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన వీడియోల ప్రకారం…ఓ నిరసనకారిణిని కోల్బ్ నేలపై అదిమిపట్టి ఆమె నోటిని తన చేతితో మూశారు. ఈ ఘటనపై ఆయన ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. జంతు ప్రేమికులతో కోల్బ్ ఘర్షణ పడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. జంతు హక్కుల కోసం పోరాడే వారి గొంతుకలను నొక్కడానికి ఫ్యాషన్ పరిశ్రమలోని పెద్దలు హింసకు ఏ విధంగా తెగబడతారో కోల్బ్ చర్యలు తెలియజేస్తున్నాయంటూ ప్రపంచంలోనే అతి పెద్ద జంతు హక్కుల సంస్థ ‘పెటా’ మండిపడింది.
జంతు హక్కుల కార్యకర్తలపై దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



