Monday, September 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాటం

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాటం

- Advertisement -

డిసెంబర్‌ 26, 27, 28 తేదీల్లో కొత్తగూడెంలో టీఎస్‌ యూటీఎఫ్‌ 7వ రాష్ట్ర మహాసభలు : మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చావ రవి, ఆదిమూలం వెంకట్‌
టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఏర్పాటు

నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యూటీఎఫ్‌) 7వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చావ రవి, ఆదిమూలం వెంకట్‌, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర మహాసభలు ఈ ఏడాది డిసెంబర్‌ 26, 27, 28 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో జరగనున్నాయని తెలిపారు. మహాసభల విజయవంతం కోసం ఆదివారం కొత్తగూడెంలోని చుంచుపల్లి విద్యానగర్‌లోని శ్రీరామ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా అధ్యక్షులు బి. మురళీమోహన్‌ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి ప్రదర్శించలేదని విమర్శించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రస్తుత ప్రభుత్వమూ నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌ఈపీ విధానాన్ని టీఎస్‌ యూటీఎఫ్‌ వ్యతిరేకిస్తోందని అన్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, చర్చలు, రౌండ్‌టేబుల్‌ సమావేశాల ద్వారా ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు. హక్కులను పోరాటాల ద్వారానే సాధించుకోవచ్చని, దానికి రాష్ట్రంలో జేఏసీ ఏర్పాటు కావడం శుభపరిణామమని అన్నారు. ప్రయివేటు విద్యాసంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ప్రభుత్వ విద్యను బలహీనపరిచే చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోరాటాల గడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

​ఆహ్వాన సంఘం ఏర్పాటు
​టీఎస్‌ యూటీఎఫ్‌ 7వ రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షులుగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అధ్యక్షునిగా కోనేరు పూర్ణచంద్రరావు, కార్యనిర్వాహక అధ్యక్షునిగా బి. రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎం. వెంకటేశ్వర్లు, కోశాధికారిగా బి. మురళీమోహన్‌ ఎన్నికయ్యారు. చీఫ్‌ ప్యాట్రన్‌గా కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ మూడ్‌ గణేష్‌, డిప్యూటీ మేయర్‌ సిరిపురపు లలితకుమారి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ నాయకులు ఎస్‌.కె. సాబీర్‌ పాషాను నియమించారు. ప్యాట్రన్లుగా భూక్యా శాంతి, శ్రీ విద్యానగర్‌ సర్పంచ్‌, వాసిరెడ్డి మురళి, వైస్‌ సర్పంచ్‌, టీజీ ఈజేఏసీ నాయకులు అమరనేని రామారావు, సంఘం వెంకట పుల్లయ్య, రమేష్‌కుమార్‌ మక్కాడ్‌, ప్రభుదయాల్‌, భార్గవ్‌ చైతన్య, టి. మాధవరావు, నీరజ, బాలాజీ, పద్మలత, మంగీలాల్‌ను నియమించారు. సహాధ్యక్షులుగా దుర్గాభవాని, సమ్మారావు, మల్లారెడ్డి, పి. నాగేశ్వరరావు, బి. నరసింహారావు, బి. రాందాస్‌, బి. కిషోర్‌సింగ్‌, ఏ. వెంకటేశ్వర్లు, వీ. వరలక్ష్మి, ఎం. రాజయ్య, ఎస్‌. వెంకటేశ్వర్లు, జిరాయ శేఖర్‌, ఎం. వీరబాబు, జీవి. నాగమల్లేశ్వరరావు, కళ్యాణం నాగేశ్వరరావులను ఎంపిక చేశారు. గౌరవ సలహాదారులుగా గౌరవ ఎమ్మెల్యేలను తీసుకున్నారు. వీరితోపాటు జిల్లా ఆఫీస్‌ బేరర్లు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సబ్‌కమిటీల కన్వీనర్లు, కార్యదర్శులుగా వ్యవహరించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్‌.దుర్గాభవాని, ఎం.రాజశేఖర్‌రెడ్డి, టి.లక్ష్మారెడ్డి, కార్యదర్శులు రంజిత్‌కుమార్‌, శ్రీధర్‌, సింహాచలం, వెంకటప్ప, రవికుమార్‌, సమ్మారావు, నాగేశ్వరరావు, వెంకటేశం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, సీనియర్‌ నాయకులు ఎస్‌కె.దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -