ఎంజీఎం పైకప్పు పెచ్చులూడి ముగ్గురికి గాయాలు
భవనాలు శిధిలావస్థకు చేరినా పట్టింపులేదు
నవతెలంగాణ-వరంగల్
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని ఆరోగ్య శ్రీ వార్డులో భవనం పైకప్పు పెచ్చులూడి పక్షవాతం వ్యాధితో. బాధప డుతున్న మస్తాన్( 55), ఎల్లమ్మ(50), ఓంకార్(33) అనే ముగ్గురు పేషెంట్లపై పడగా వారికి గాయాలు కావడంతో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిది స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గం, జాఫర్ గడ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన వారని బందువులు తెలిపారు. ఎంజీఎంలో పని చేసిన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. భవనం పూర్తిగా శిధిలావస్థకు చేరింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఎంజీఎంలో పని చేయాలంటే భయంతో విధులు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ప్రైయివేట్ వాళ్లవి పురాతన భవనాలు సిటీలో ఉంటే. వెంటనే నోటీస్ లు ఇస్తారుకానీ ప్రభుత్వ భవనాలు అయితే శిధిలావస్థకు చేరి పెచ్చులూడి పేషంట్ల పై పడినా పట్టించుకోరా అని పేషెంట్లు ప్రశ్నిస్తున్నారు. ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోక పోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృత మతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి లోకి ఎంజీఎం మార్చాలని కోరుతున్నారు.



