నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ పోలీస్ శాఖలో మరో విషాదం చోటు చేసుకుంది. మలక్‌పేట్‌లో పోలీస్ కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముసారాంబాగ్ శాలివాహన నగర్‌లోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్.. గత అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసి తాను ఉరేసుకుంటున్నట్లు యువతికి చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో సదరు యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు విషయం వెల్లడించింది. ఆమె సమాచారంతో చైతన్యపురి పోలీసులు మలక్‌పేట్ పోలీసులకు సమాచారం చేరవేర్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న మలక్‌పేట్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కానిస్టేబుల్ మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
మలక్‌పేట్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



