Monday, September 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐకేపీ సిబ్బంది సమీక్షా సమావేశం

ఐకేపీ సిబ్బంది సమీక్షా సమావేశం

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
మండల సమైక్య కార్యాలయంలో మద్నూర్, బిచ్కుంద, మండలాల ఐకెపి సిబ్బందికి సోమవారం సమీక్ష‍ా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు డి.ఆర్.డి.ఓ  విజయలక్ష్మి, డిపిఎం సాయిలు, స్త్రీ నిధి రీజినల్ మేనేజర్ కిరణ్‌లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సంఘాల్లో ఉన్నవారికి eKYC ఈ కేవైసీ పూర్తి చేయాలని, గ్రామంలో మిగిలిపోయిన వారిని వివిధ సంఘాల్లో చేర్పించాలని సూచించారు. స్త్రీనిధి, బ్యాంక్ లింకేజ్ రికవరీ చేయాలని తెలిపారు. టి ఓ ఎస్ ఎస్లో భాగంగా సంఘాల్లో కొంతమంది చదువు మానేసిన వారికి ఓపెన్ సిస్టమ్ లో 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాయించాలని చెప్పారు.

స్కూల్ పిల్లలకు యూనిఫాంలు మొదటి జత అందజేస్తామనీ, రెండవ జత కూడా వారంలో పూర్తి చేసి ఇవ్వాలని చెప్పారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా సంఘాల్లో ఉన్న నిరాక్షరాస్యులకు అక్షరాలు నేర్పించి వారికి పరీక్ష ద్వారా పాస్ అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెండు మండలాల నుండి వచ్చిన వివోఏ లు, సీసీ లు మరియు  బిచ్కుంద ఏపిఎం రవీందర్, మద్నూర్ మండల ఏపీఎం జగదీశ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -