- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల సిలబస్‌లో మార్పుపై వస్తోన్న ఊహాగానాలపై స్పందించింది. తాము ఎలాంటి సిలబస్ కమిటీని ఏర్పాటు చేయలేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ వెబ్‌నోట్‌ని విడుదల చేసింది. సిలబస్ మార్పు ప్రచారంతో ఆందోళన చెందుతున్న అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులు, సందేహాలపై స్పందించిన కమిషన్.. సిలబస్‌లో పెద్దగా ఏవైనా మార్పులు ప్రతిపాదిస్తే ఏడాదికి ముందే తెలియజేస్తామని పేర్కొంది.
- Advertisement -



