Wednesday, September 23, 2026
E-PAPER
Homeజాతీయంబీజేపీ పాలిత రాష్ర్టంలో మరో యువ జంటపై దాడి

బీజేపీ పాలిత రాష్ర్టంలో మరో యువ జంటపై దాడి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్‌‌లో బాలిక, ఆమె స్నేహితుడిపై వేధింపులను మర్చిపోకముందే.. తాజాగా అలాంటి మరో ఘటన మరో బీజేపీ పాలిత రాష్ర్టంలో చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఒడిషాలోని ధెంకనాల్ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కపిలాష్‌‌కు సమీపంలో ఒక యువ జంటపై కొంత మంది దుండగులు వేధింపులకు పాల్పడి, దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ ‌మీడియాలో వైరల్‌‌గా మారింది.

వీడియోలోని దృశ్యాల ప్రకారం… ఒక యువ జంట మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తుండగా, కొందరు దుండగులు వారిని అడ్డగించారు. జంటను చుట్టుముట్టి వారిపై వేధింపులకు దిగారు. కొంతమంది యువకుడిపై దాడి చేయగా, మరికొంత మంది యువతితో అనుచితంగా ప్రవర్తించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తమను వదలి పెట్టాలని మహిళ తన చుట్టూ ఉన్నవారిని పదేపదే వేడుకోవడం కూడా ఇందులో వినిపిస్తోంది. ఆమె ఎంతగా ప్రాధేయపడినా వారి వినకుండా దాడి, వేధింపులు కొనసాగించారు.

ఈ నెల 18న ఈ ఘటన జరిగినట్లుగా భావిస్తున్నారు. బాధితుల్ని కటక్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనతో రాష్ర్టంలో మహిళల భద్రతతో పాటు పర్యాటక ప్రాంతాల వద్ద యాత్రికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. వీడియో వెలుగులోకి రావడంతో పోలీసులు స్పందించారు. ధెంకనాల్ ఎస్‌‌పి అభినవ్ సోంకర్ మీడియాతో మాట్లాడుతూ నిందితులు సరోజ్ నాయక్, సమీర్ నాయక్, సంగ్రామ్ రథ్‌ లను అరెస్టు చేశామని, మిగిలిన వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -