Wednesday, September 23, 2026
E-PAPER
HomeఆటలుAsian Games: సాఫ్ట్ టెన్నిస్ లో కాంస్య పతకం

Asian Games: సాఫ్ట్ టెన్నిస్ లో కాంస్య పతకం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఆసియా క్రీడల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారతదేశం చారిత్రక ఘనత సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల క్రీడాకారుడు జయ్ మీనా కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్ చరిత్రలోనే ఈ క్రీడలో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి.

బుధవారం నాటి సెమీఫైనల్ పోరులో జపాన్‌కు చెందిన టకుయా కురోసాకాతో జయ్ మీనా తలపడ్డాడు. 45 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ప్రారంభంలో జయ్ వరుసగా మూడు గేమ్‌లు ఓడిపోయి ఒత్తిడిలో పడ్డాడు. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లను (4-1, 6-4) తన ఖాతాలో వేసుకుని మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -