Wednesday, September 23, 2026
E-PAPER
Homeజాతీయంసర్ పేరుతో ఈసీ దేశ ద్రోహానికి పాల్పడింది

సర్ పేరుతో ఈసీ దేశ ద్రోహానికి పాల్పడింది

- Advertisement -
  • రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్

నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం(EC)పై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియ పేరుతో ఈసీ రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి చేస్తోందని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ , ఈసీ దేశద్రోహానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఈసీపై విమర్శలు గుప్పించారు.

“నేను ఎన్నికల కమిషన్‌కు, ఎన్నికల అధికారులకు స్పష్టంగా చెబుతున్నాను. మీరు చేస్తున్నది తప్పు. ఇది దేశద్రోహం, ఇది దేశానికి వ్యతిరేకం. ఇది మర్చిపోవద్దు. సమయం వస్తుంది! మేము మిమ్మల్ని పట్టుకుంటాము! మిమ్మల్ని వదిలిపెట్టం.” అని ఆయన రాసుకొచ్చారు.

బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారులను నియమించడం ద్వారా ఎన్నికల నిర్వహణ యంత్రాంగం పక్షపాతపూరితంగా మారిందని మమతా బెనర్జీ అన్నారు. దేశ ఎన్నికల చరిత్రలోనే ఇది అపూర్వమైన కుంభకోణమని, ఇది అత్యంత వివాదాస్పదమైన వ్యవహారం. తమ జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఈ ఎన్నికల కమిషనర్‌ను తప్పక అరెస్టు చేయాలి. పదవిలో కొనసాగే నైతిక అర్హత ఆయనకు లేదు అని ఆమె డిమాండ్ చేశారు.

సర్ పేరుతో ఆయా రాష్ట్రాల్లోని ప్రజా తీర్పును అపహరించారని, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీహార్ శాసనసభ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. గత 10 నెలల్లో మేము ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు చేశామని. కమిషన్‌లోని ఇతర ఎన్నికల కమిషనర్లు దీనిపై ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాత్రం మౌనంగానే ఉన్నారని ఆయన విమర్శలు గుప్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -