Homeతెలంగాణ రౌండప్ప్రజా పాలన ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం: సర్పంచ్‌

ప్రజా పాలన ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం: సర్పంచ్‌

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ప్రజా పాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వ హాయంలోనే ప్రజా సంక్షేమం కొనసాగుతోందని అంతాపూర్ గ్రామ సర్పంచ్ పార్వతి బాయి అన్నారు. గురువారం డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ ప్రారంభించారు. ఈ మేరకు లబ్దిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలోనే ప్రజా సంక్షేమం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ మురళీధర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దత్తు, ఉపసర్పంచ్ అఖిల్, గ్రామ పెద్దలు విటల్ గ్రామస్తులు రేషన్ వినియోగదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -