- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్లోని ఖైరతాబాద్ సమీపంలో శుక్రవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జన వాహనం కిందపడటంతో 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. పోలీసులు శోభాయాత్రలో డాన్స్ చేస్తున్న వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో భయపడి ట్యాంకర్ పైకి ఎక్కే క్రమంలో యువకుడు ప్రమాదవశాత్తు ట్రక్ కింద పడి మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఖైరతాబాద్ వద్ద తోటి స్నేహితులు ఆందోళనకు దిగగా, పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
- Advertisement -



