నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. కేరళకు చెందిన ప్రతిష్ఠాత్మక ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ అందజేస్తున్న ‘ఆర్యదాన్ ముహమ్మద్ – 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. తెలంగాణలో ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతతో పాటు రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన అమలు చేస్తున్న వినూత్న పథకాలు, దూరదృష్టి గల నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ వర్కింగ్ చైర్మన్, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌకత్ ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవం కేరళలోని నిలంబూర్‌లో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జరగనుంది. దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్యదాన్ ముహమ్మద్ 4వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అవార్డును స్వీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేరళ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ స్మారకోపన్యాసం చేయనున్నారు. రూ. లక్ష నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపికను రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి ‘ఆర్యదాన్ ముహమ్మద్’ అవార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


