- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్లు, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతినిచ్చింది. గురువారం రాత్రి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేశ్‌కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, డిటిసిపి అనుమతులు పొందిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు తొలగిపోయాయి. రంగారెడ్డిలో 44, మేడ్చల్-మల్కాజ్‌గిరిలో 65, రాష్ట్రవ్యాప్తంగా 264 కాలనీల్లో ఆస్తుల విక్రయాలకు స్వేచ్ఛ లభించింది. అయితే, కోర్టు స్టే ఉన్న ఆస్తులకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తారు. సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.
- Advertisement -



