- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సాహితీ ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ దర్యాప్తులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. రూ.2.1 కోట్ల నగదు లావాదేవీలపై వివరణ తీసుకునేందుకు ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. సాహితీ ఇన్‌ఫ్రా ఖాతాల నుంచి గాంధీకి సుమారు రూ.2.1 కోట్ల మేర బదిలీ అయినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం.
- Advertisement -


