నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ చేస్తూ, జూన్ 15వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గురువారం రాష్ట్రంలోని కనీసం 10 జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి
తెలంగాణకు భారీ వర్ష సూచన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES