Thursday, October 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహయత్ నగర్ లో 2 కేజీల గంజాయి చాక్లెట్లు స్వాధీనం

హయత్ నగర్ లో 2 కేజీల గంజాయి చాక్లెట్లు స్వాధీనం

- Advertisement -

నవతెలంగాణ- హైదరాబాద్: హయత్ నగర్ కుంట్లూర్ రోడ్డులో ఓ దుకాణంలో నిషేదిత పొగాకు ఉత్పత్తులు, గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. శుభోదయ కాలనీలో ఉండే షాప్ యజమాని గుండు శేఖర్, చౌటుప్పల్ మండలానికి చెందిన శంకర్ మిశ్రా నుంచి రూ.40వేల విలువ గల 2 కేజీల చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులు మాట్లాడుతూ.. గంజాయి చాలా హానికరమైనది అన్నారు. దాన్ని అమ్మినా.. కొన్నా.. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి వాటి గురించి ఎవరికి తెలిసినా వెంటనే మాకు సమాచారం అందించాలని సీఐ నాగరాజు గౌడ్, ఎస్సై వెంకట్ రెడ్డి ప్రజలను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -