Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఆపరేషన్ కగార్ ను ఆపాలి..

ఆపరేషన్ కగార్ ను ఆపాలి..

- Advertisement -

– జూన్ 17న చలో హైదరాబాద్ మహా ధర్నాను జయప్రదం చేయాలి 
– అఖిలపక్షం ఆధ్వర్యంలో పోస్టర్  ఆవిష్కరణ
నవతెలంగాణ – ఆళ్ళపల్లి(గుండాల)
: అడవుల్లోని ఖనిజ నిక్షేపాలను, వనరులను కార్పొరేట్లకు కట్టబెట్ట చూసే ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలని శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం గుండాల మండల కేంద్రంలో అఖిల పక్షం నాయకుల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించడం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. జూన్ 17వ తేదీన హైదరాబాదులో జరిగే మహాధర్నాకు ప్రజలు అధిక సంఖ్యలో కదిలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కొమరం సీతారాములు, అరెం నరేష్, పర్శక రవి, వజ్జ ఎర్రయ్య, సీపీఐ నాయకులు వాగబోయిన రమేష్, గడ్డం శ్రీను, కాంగ్రెస్ నాయకులు ఈసం పాపారావు, అబ్దుల్ నబీ, బీఆర్ఎస్ నాయకులు తెల్లం భాస్కర్, గడ్డం రమేష్, గంగాధర నగేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad