Friday, June 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌కు ట్రంపే నంబర్‌ వన్‌ శత్రువు : ఇజ్రాయెల్‌ ప్రధాని

ఇరాన్‌కు ట్రంపే నంబర్‌ వన్‌ శత్రువు : ఇజ్రాయెల్‌ ప్రధాని

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇరాన్ చంపాలని చూస్తోందని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు అన్నారు. తమ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్‌ను ఇరాన్‌ గుర్తించిందన్నారు. ‘‘ఇరాన్‌కు ట్రంపే నంబర్‌ వన్‌ శత్రువు. ట్రంప్‌ నిర్ణయాత్మక నాయకుడు. ఇరాన్‌తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ఆయన రద్దుచేశారు. ఇరాన్‌ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు. ఇజ్రాయెల్‌ తననే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని చాలా వరకు వెనక్కి నెట్టాయి’’ అని నెతన్యాహు అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -