ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కాంబోలో రూపొందిన పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్ఎల్విసీ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ‘కుబేర’ ట్రైలర్‌ని లాంచ్ చేసిన అనంతరం దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ,’శేఖర్ కమ్ముల చాలా దఢ నిశ్చయం కలిగిన మనిషి. తను నమ్మిన సిద్ధాంతానికి ఏది అడ్డు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు. ఆ క్వాలిటీని నేను చాలా ఎడ్మైర్ చేస్తాను. ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. నాగార్జున, శేఖర్ కమ్ముల, టైటిల్ కుబేర.. ఈ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే ఫెంటాస్టిక్‌గా అనిపించింది. ధనుష్ కూడా ఇందులో ఉన్నారని తెలిసిన తర్వాత అద్భుతమైన కాంబినేషన్ అనిపించింది. ట్రాన్స్ అఫ్ కుబేర రిలీజ్ అయిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక రిచ్ ప్రపంచంలో నాగర్జున, పూర్ ప్రపంచంలో ధనుష్ .. సినిమా కథ గురించి ఏమి చెప్పకుండా ఈ రెండు క్యారెక్టర్స్‌ని చూపించడం చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల తన సినిమాని ట్రైలర్లోనే చెప్పేస్తారు. కానీ కుబేర విషయానికి వస్తే నాకు ఒక సస్పెన్స్ సినిమా లాగా అనిపిస్తుంది. నాగార్జునని, ధనుష్‌ని ఎలా కలిపిపాడు? వాళ్ళ మధ్య డ్రామా ఏంటి? అనేది చాలా క్యూరియాసిటిగా అనిపిస్తుంది. దీని కోసం ఈగర్‌గా ఎదురుచూస్తున్నాను. ట్రైలర్ ఆసక్తిని మరింత పెంచింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. ప్రతిది టాప్ క్లాస్‌లో ఉన్నాయి. దేవిశ్రీ ఇచ్చిన నాది నాది సాంగ్, కుబేర థీమ్ ఇవన్నీ ఫెంటాస్టిక్‌గా ఉన్నాయి’ అని తెలిపారు.
‘ఇది కేవలం శేఖర్ కమ్ముల ఫిల్మ్. మేమందరం ఇందులో పాత్రలు మాత్రమే. ఆయన కంఫర్ట్ జోనర్ నుంచి బయటికి వచ్చి తీసిన సినిమా. మమ్మల్ని కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొచ్చాడు. ‘మాయాబజార్’ చూసినప్పుడు అది కె.వి రెడ్డి ఫిల్మ్ అంటాం. అలాగే ‘కుబేర’ కూడా శేఖర్ కమ్ముల చిత్రం’ అని నాగార్జున చెప్పారు. హీరో ధనుష్ మాట్లాడుతూ,’ఇది నాకు 52వ తమిళ్ సినిమా, రెండవ తెలుగు సినిమా. ఇందులో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు శేఖర్‌కి ధన్యవాదాలు. నాగార్జునతో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. రష్మిక హార్డ్ వర్క్ చేసింది. ఇది నాకు చాలా స్పెషల్ చిత్రం’ అని అన్నారు.
ప్రతి సినిమా కూతురు లాంటిది, కొడుకు లాంటిదని చెప్తుంటాను. ‘కుబేర’ మాత్రం తల్లి ప్రేమ లాం టిది. బిచ్చగాడు అయినా కోటీశ్వరు డైన తల్లి ప్రేమ ఒక్కటే. అలాంటి ఐడియా లజీతో కథ రావడం అదష్టంగా భావిస్తున్న. సినిమా చాలా బాగా వచ్చింది. ఇది చాలా కొత్త సినిమా. ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని సినిమా. అంత ఫ్రెష్‌గా ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఆడియన్స్ అయినా ఇది మా సినిమా అనుకునేలా వచ్చింది. ట్రూ పాన్ ఇండియన్ మూవీ. ఇందులో నవ్వు, ఎమోషన్, ఏడుపు, థ్రిల్, ఆశ్చర్యం, బాధ అన్ని కలగలిపి ఉంటాయి. నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది.
– డైరెక్టర్ శేఖర్‌కమ్ముల