Tuesday, August 11, 2026
E-PAPER
Homeసినిమాఫ్యామిలీతో చూసే సినిమా

ఫ్యామిలీతో చూసే సినిమా

- Advertisement -

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు ఈనెల 15న థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నాయి.
ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్‌ సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మాత సురేష్‌బాబు విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఆయన మాట్లాడుతూ,‘తెలంగాణ నుంచి వచ్చిన దర్శక, నిర్మాతలు ఎంతో పాషన్‌తో సినిమా తీశారు. మా సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రతినిధులు ఈ సినిమా చూసి పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడంతో ఈ సినిమాను మా సురేష్‌ ఏషియన్‌ ఫిలింస్‌ ద్వారా విడుదల చేస్తున్నాం. ఈ సినిమా విషయంలో ఎదురైన అన్ని కష్టాలు దాటుకుని ఈస్టేజ్‌కు వచ్చారు. వాళ్ల ఎగ్రెసివ్‌తో ఈ సినిమాను మార్కెటింగ్‌ చేస్తున్నారు. తప్పకుండా అందరి టైమ్‌ను, డబ్బుకు విలువ నిచ్చే సినిమా ఇది నమ్ముతున్నారు. విడుదలకు ముందే కొన్ని షోలు వేస్తున్నారు. ఆ పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌తో.. మౌత్‌ టాక్‌తో ఈ సినిమా మరింత మందికి రీచ్‌ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకుడు బిక్షు మాట్లాడుతూ,‘ఈ సినిమా కథ, కథనం అంతా సమాజంలో నేను చూసింది రాసు కున్నాను. ప్రతి సన్నివేశం ఎంతో నేచురల్‌గా ఉంది. కమర్షియల్‌ అంశాలతో పాటు ఓ సందేశం కూడా ఉంది. అందరూ ఫ్యామిలీతో చూసే సినిమా’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -