No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతాజా వార్తలురెండు లారీలు ఢీ..భారీ అగ్నిప్రమాదం

రెండు లారీలు ఢీ..భారీ అగ్నిప్రమాదం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం, వేముల స్టేజి సమీపంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో జాతీయ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న భారీ లోడుతో స్లో గా వెళ్తున్న ఆళ్ళగడ్డల లారీని, వెనుకనే స్పీడ్ గా వస్తున్న బండలలోడు లారీఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళుతున్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి.

ఈ సంఘటనలో బండలలోడు లారీ ముందుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అందులో ఉన్న డ్రైవర్ రాజశేఖర్, క్లీనర్ రామకృష్ణ ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను విను వెంటనే హైవే అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఒక్కసారిగా భారీ మంటలు వ్యాప్తి చెందడంతో హైవేపై వెళ్లే ప్రయాణికులకు ఏం జరిగిందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మంటలు సుమారు రెండు గంటల పాటు చెలరేగాయి. హుటాహుటిన రెండు ఫైర్ ఇంజన్లనును అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ఈ ప్రమాదం ఎలా జరిగిందో దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad