Monday, April 27, 2026
E-PAPER
Homeజాతీయంబెంగాల్‌లో బీజేపీని ఓడించడం అత్యంత ముఖ్యం:CPI జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డి.రాజా

బెంగాల్‌లో బీజేపీని ఓడించడం అత్యంత ముఖ్యం:CPI జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డి.రాజా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బెంగాల్‌లో బీజేపీని తిర‌స్క‌రించాల‌ని CPI జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ డి.రాజా ప్ర‌జ‌లకు పిలుపునిచ్చారు. బీజేపీ గెలుపుతో బెంగాల్‌తో పాటు దేశాన్ని సంక్షోభంలో ప‌డేస్తుంద‌న్నారు. నేటితో ముగియునున్న‌ సెకండ్ ఫేజ్ ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీకి మద్దతు ఇవ్వవద్దని నేను బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. బెంగాల్‌లో బీజేపీని ఓడించడం అత్యంత ముఖ్యం. బెంగాల్‌లో బీజేపీ అధికారాన్ని హస్తగతం చేసుకోనివ్వకూడదు. ఇది కేవలం బెంగాల్‌కే కాకుండా, యావత్తు దేశానికి కూడా వినాశకరంగా పరిణమిస్తుంద‌ని’ అని చెప్పారు.

కాగా, ఏప్రిల్ 9న కేర‌ళ‌, అసోం, పాండిచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్ జ‌రగ్గా 23న త‌మిళ‌నాడులో ఒకే ద‌ఫాలో ఎన్నిక‌లు ముగియ‌గా, బెంగాల్‌లో తొలి విడ‌త ఎన్నిక‌లు జ‌రిగాయి. 16 జిల్లాల్లో 152 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. 93 శాతం ఓటింగ్ నమోదైంది. ఈనెల 29న సెకండ్ ఫేజ్‌లో 142 నియోజకవర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈక్ర‌మంలో బెంగాల్‌లో నేటితో రెండో విడ‌త ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. సాయంత్రం 6 గంటలకు మైకులు మూగ‌బోనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -