Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

- Advertisement -

ఆర్టీఐ నాయకులు వెంకటేశ్వర్లు, కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని యుంసీటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ.. కౌలు రైతులు ప్రభుత్వ గుర్తింపు పొందలేక వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతమన్నారు. భూమి కౌలుకు తీసుకొని అరుగాలం కష్టపడి పంట పండిస్తే పండించిన పంటను ప్రభుత్వానికి అమ్ముకోలేని పరిస్థితి నెలకొందన్నారు. చివరకు పట్టేదారు పేరున పంట విక్రయించి వీరి శ్రమ డబ్బులు వారిని అడుక్కోవాల్సి వస్తుందన్నారు. సాగు రుణాలు పొందలేక ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని తీర్చలేక ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారని తెలిపారు. కౌలు రైతులను ఆదుకోవాలంటే 2011 భూ అధీకృత వాస్తవ సాగుదారుల చట్టం ప్రకారం కౌలు గుర్తింపు కార్డులు అందజేసి భూపాలపల్లి జిల్లాలోని సుమారు ఇరువై వేలమంది కౌలు రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోచయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -