నవతెలంగాణ – అమరావతి: ఏపీలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాయచూరు నుంచి కొందరు యాత్రికులు ఓ ప్రయివేట్ బస్సులో కాశీ యాత్రకు బయలుదేరారు. వీరి బస్సు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి వద్దకు రాగానే, కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. నరసరావుపేట నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మరణించారు. బస్సులోని 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బారులుతీరిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
లారీని ఢీకొట్టిన కాశీ యాత్రికుల బస్సు..
- Advertisement -
- Advertisement -