Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeదర్వాజసాహితీ స‌మాచారం

సాహితీ స‌మాచారం

- Advertisement -

‘భీమకవి’ చోడగిరిచంద్ర రావు సమగ్ర కవిత్వం ఆవిష్కరణ
కోయి కోటేశ్వరరావు సంపాదకత్వం వహించిన ‘భీమకవి’ చోడగిరిచంద్ర రావు సమగ్ర కవిత్వం ఆవిష్కరణ సభ జులై 20న ఉదయం10 గం. లకు యూ.టి.ఎఫ్‌ బిల్డింగ్‌, కాకినాడలో జరుగుతుంది. నేలపూడి బాలరాజు, పొనుగుమట్ల విష్ణుమూర్తి, కోరుకొండ బాబ్జీ, శిఖామణి, జి లక్ష్మీనరసయ్య, చోడగిరి లలితాదేవి, బండి సత్యనారాయణ, కొబ్బరాకు సుధాకర్‌, అద్దేపల్లి ప్రభు, మాకివీడి సూర్యభాస్కర్‌, నేలపూడి రత్నజీ తదితరులు పాల్గొంటారు. – రాజేష్‌, సవిలే ఫౌండేషన్‌, కాకినాడ


20 న ‘ప్రణామం’ కవి సమ్మేళనం
మల్లెతీగ సాహిత్య సేవాసంస్థ ఆధ్వర్యంలో జులై 20న ఉదయం 10 గంటలకు విజయవాడ బందర్‌ రోడ్డు, అంబేడ్కర్‌ స్మతివనం ఆవరణలో ఎంపిక చేయబడిన కవులతో ‘ప్రణామం’ కవి సమ్మేళనం జరుగనుంది. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డా|| జి. లక్ష్మీ పాల్గొంటారు. ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలకు చెందిన కవులు భాష, సామాజిక న్యాయం, దేశభక్తి, శాంతి, పర్యావరణం అంశాలపై తమ కవితల్ని వినిపిస్తారు. వివరాలకు 92464 15150.


తెలకపల్లి రవి ఐదు పుస్తకాల ఆవిష్కరణ
ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తెలకపల్లి రవి రచనలు ఆశయపధం (నవల), అభద్ర (కథలు), సజీవం (కవిత్వం), ఆశయాల బాటలో (పాటలు), మీరే ప్రేరణ మీదే సాధన (వ్యక్తిత్వ వికాసం), సంకలనం (నేనెప్పుడూ కమ్యూనిజానికే సొంతం : ఆరుద్ర) ఐదు పుస్తకాల ఆవిస్కరణ సభ విజయవాడ గవర్నరుపేట బాలోత్సవ్‌ భవన్‌ 2వ అంతస్తులో జరుగుతుంది. ఈ సభలో యం.వి.యస్‌.శర్మ, కె.రామచంద్రమూర్తి, వి.కృష్ణయ్య, బి.తులసీదాస్‌, కె.ఆనందాచారి, కెంగార మోహన్‌, సత్యాజీ, గోళ్ల నారాయణరావు పాల్గొంటారు.


ఇంద్రగంటి శ్రీకాంత శర్మ పురస్కారం, 2025
‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహితీ పురస్కారం’ 2025 వ సంవత్సరానికి కవి విన్నకోట రవి శంకర్‌ ఎంపికయ్యారు. అవార్డు ప్రదానోత్సవ తేదీ, వేదికల వివరాలు కమిటీ తరువాత తెలియజేస్తుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad