- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : ఇటీవల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో మద్నూర్ ఎస్సై విజయ్ కొండ రెండు వెండి పథకాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా బీజేపీ మండల శాఖ ఎస్సైని అభినందిస్తూ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం బీజేపీ మండల అధ్యక్షుడు తెప్పవార్ తుకారాం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ పటేల్, తులవార్ సంతోష్ ,లూటే ప్రవీణ్, కంచెన్వార్ యాదరావు, ప్రశాంత్, అద్విక్ దేశాయ్, సుంకరి అంజయ్య, గడ్డి తుకారాం, శివకుమార్, లక్ష్మణ్ పటేల్ , ఆర్ సుభాష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -