- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో మరికాసేపట్లో భారీ వర్షం అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్ర హెచ్చరికలు జారీ చేసాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరం అంతా ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కురవనుందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇల్లు దాటి బయటికి రావొద్దని సూచించింది. ప్రయాణ ఏర్పాట్లను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని హైడ్రా ఇప్పటికే నగర పౌరులకు అలర్ట్స్ జారీ చేసింది
- Advertisement -