నవతెలంగాణ – హైదరాబాద్ : ఆరు హత్యలు చేసి పరారీలో ఉన్న నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపినా.. పట్టిం చేందుకు సహకరించిన వారికి రూ.2లక్షల రివార్డు అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రకటించారు. సమాచారం అం దించిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, వారి భద్రతకు పూర్తి హామీ ఇస్తామని చెప్పారు. నిందితుడి గురించి ఏవైనా వివరాలు తెలిసిన వారు చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 65324 నంబర్‌కు ఫోన్ కాల్ లేదా వాట్సప్ ద్వారా సమాచారం అందించొచ్చని సూచించారు. నిందితుడి కోసం ఇప్పటికే ఏడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. త్వరలోనే అరెస్టు చేసి చట్టం ముందు నిలబెడతామన్నారు. ప్రజలు వదంతులను నమ్మొద్దని, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతమూ కలగకుండా బాధ్యతా యుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
షాబాద్ ఆరు హత్యలు..నిందితుడి ఆచూకీ తెలిపితే రూ.2 లక్షల రివార్డు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


