- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు దేవాలయాల్లో శ్రావణమాసం మూడో శుక్రవారం పురస్కరించుకొని వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించి అమ్మవారిని పూజించారు.
మురళీకృష్ణ దేవాలయంలో విద్యానగర్లో గల దివ్య జీవన శ్రీ మురళీకృష్ణ దేవాలయంలో శ్రావణమాసం మూడవ శుక్రవారం మరియు వరలక్ష్మి వ్రతం సందర్భంగా దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణగా గాజులతో అలంకరించడం జరిగింది. మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమము వరలక్ష్మీ వ్రతము నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దేవాలయం కమిటీ సభ్యులు మంచి కంటి వెంకటేశం, పసుపునూరి మనోహర్, జూలకంటి వెంకటరమణ, గంగం యాదగిరి రెడ్డి, సోమచంద్రగుప్త, చింతపండు రాజు, మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -