Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ సరస్వతి శిశు మందిర్ లో మొక్కలు నాటే కార్యక్రమం

శ్రీ సరస్వతి శిశు మందిర్ లో మొక్కలు నాటే కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని  శ్రీ సరస్వతి శిశు మందిర్ లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల ఆవరణలో పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఉట్నూర్ రాజశేఖర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు తోడ్పాటును అందించాలన్నారు. అందులో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని, చెట్లు ఉంటే క్షేమం.. లేకుంటే క్షమం అని పేర్కొన్నారు. ప్రజలు అత్యధికంగా చెట్లు నాటి సంరక్షించడం ద్వారా భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువును అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్, నివాళిక, నికిత, సంధ్య, మమత, రిషిక, కవిత, అటెండర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -