Monday, June 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప్లూర్ లో బడి బాట కార్యక్రమం

ఉప్లూర్ లో బడి బాట కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరం పురస్కరించుకొని  బడి బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను పంపిణీ చేశారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్  ఏనుగందుల శైలేందర్ చేతుల మీదుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజన్న, ఉప సర్పంచ్ తక్కూరి శేఖర్, వార్డ్ సభ్యులు రాకేష్, అజయ్, ఆకుల శేఖర్, సదుల్లా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -