Monday, June 15, 2026
E-PAPER
Homeఆదిలాబాద్జొన్నల కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

జొన్నల కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఐకెపి ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో సోమవారం జిల్లా కలెక్టర్ భువేష్ మిశ్రా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రాలను పరదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గింజను ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేపడతామని రైతులకు సూచించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కొనుగోలు చేపట్టిన జొన్నలను లారీల కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటామని సూచించారు. ఇంతకుముందు విటళేశ్వర్ ఆలయం సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు కలెక్టర్ కు ఆలయ కమిటీ శాలవా పూల మాలతో ఘనంగా సన్మాంచారు.

అక్కడి నుంచి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ఆస్పత్రిలో రోగులకు అవసరమైన మందులు ఆసుపత్రి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించి విట్టళేశ్వర్ ఆలయం నుంచి మ్యాదరి గల్లి వరకు ఉన్న మురికి కాలువను స్వయంగా పరిశీలించి మురికి కాలువలు సరిగ్గా లేకపోవడంతో వర్షాకాలంలో వరద నీరు అధికంగా ప్రవహించి ఆస్పత్రి విట్టళేశ్వర్ ఆలయం, మ్యాదరి గల్లి పూర్తిగా జలమయమవుతున్నాయి. అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కాలనీవాసులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

అనంతరం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు వసతుల గురించి అడిగి తెలుసులున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యలు విద్యార్థులకు వసరమైన అదనపు గదులు మరియు కంపాండ్ వాల్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు తెలపడంతో అవసరమైన గదులు మంజూరు చేసేందుకు ప్రణాళికలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న కు సూచించారు.ఆయన వెంట బైంసా మార్కుట్ కమిటీ చెర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్ గొనె కళ్యాణ్ ఎంపీడీఓ బీమేష్, తహసీల్దార్ శ్రీదేవి,ఐకేపి ఎపిఎం దత్తు,సర్పంచ్ కందురు సాయినాథ్ పంచాయతీ కార్యదర్శి జాదవ్ మాధవ్ కస్తూర్బా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వీణ,నాయకులు రైతులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -