జయంతి వేడుకల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్
నవతెలంగాణ – మద్నూర్
నవ భారత నిర్మాత దేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసి, భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన మార్గదర్శి, దివంగత ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ అని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ అన్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పించారు. ఈ జయంతి వేడుకల్లో మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ వార్ సాయిలు , మిర్జాపూర్ హనుమాన్ మందీర్ చైర్మన్ రామ్ పటేల్ , మాజీ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్ , సీనియర్ నాయకులు హన్మండ్లు స్వామి , కొండ గంగాధర్ , వట్నాల్ వార్ రమేష్ , మాజీ. ఎంపీటీసీ కుటుంబ సభ్యులు రచ్చ కుశాల్ , బండి గోపి , దిగంబర్ , బాదవార్ హన్మండ్లు, గంగాధర్ కర్రెవార్ , శివరెడ్డి ,బండి హన్మండ్లు తదితరులు ఉన్నారు.
భారతరత్న అవార్డు గ్రహీత స్వర్గీయ రాజీవ్ గాంధీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES