- Advertisement -
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఐటీ కంపెనీ ఓరాకిల్ తమ సంస్థలో పని చేస్తోన్న 2800 మంది ఉద్యోగులపై వేటు వేస్తోంది. భారత్‌లోని తన 28,824 మంది ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందికి సమానమయ్యే 2800 మందిని ఇంటికి పంపించాలని భావించింది. ఏఐ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల కోసం పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబయి, పూణె, నోయిడా, కోల్‌కతాలోని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్ సేవలు, కస్టమర్ సపోర్ట్ బృందాల్లో కోతల ఉండనున్నాయి. కాగా ఈ ఉద్వాసనలు ఆకస్మికంగా, సెవరెన్స్ ప్యాకేజీలు లేకుండా జరిగాయని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -