కీలక వడ్డీరేట్లు యథాతథం

నవతెలంగాణ ముంబయి: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ‘భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI)’ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. దీంతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుందిబుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన (RBI Monetary Policy) కమిటీ సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించారు.
ముఖ్యాంశాలు:

  • భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్ఠంగా ఉన్నాయి.
  • 2023-24 ఆర్థిక సంవత్సరం రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2023-24 మూడో త్రైమాసికంలో ఇది 5.6 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 5.2 శాతం ఉండొచ్చని తెలిపింది. లక్ష్యిత పరిధి అయిన నాలుగు శాతానికి ఇంకా చేరుకోవాల్సి ఉంది.
  • 2023-24లో దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 6.5 శాతం నుంచి 7 శాతానికి ఆర్‌బీఐ పెంచిందిమూడో త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా, నాలుగో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో వృద్ధి రేటు వరుసగా 6.7 శాతం, 6.5 శాతం, 6.4 శాతంగా ఉండే అవకాశం ఉంది..
  • వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువలో ఒడుదొడుకులు చాలా తక్కువగా ఉన్నాయి.
  • 2023 డిసెంబర్‌ 1 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 604 బిలియన్‌ డాలర్లు
  • డిజిటల్‌ రుణాల్లో మరింత పారదర్శకత తెచ్చేలా రుణ ఉత్పత్తులను అందించే వెబ్‌ అగ్రిగేటర్ల కోసం ఆర్‌బీఐ మార్గదర్శకాలను రూపొందించింది.
  • ఆస్పత్రులు, విద్యా సంస్థలకు UPI చెల్లింపుల పరిమితిని ఆర్‌బీఐ రూ.1 లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచింది.
  • రికరింగ్‌ చెల్లింపుల ఇమ్యాండేట్‌ పరిమితిని రూ.15 వేల నుంచి రూ.1 లక్షకు పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
Spread the love