– టెక్స్‌టైల్, డైమాండ్స్, కెమికల్స్‌పై అధిక ప్రభావం
– క్రిసిల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ ఇటీవల భారత్‌పై విధించిన అధిక సుంకాలు ఇక్కడి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)పై తీవ్ర ప్రభావం చూపనుందని రేటింగ్ ఎజెన్సీ క్రిసిల్ ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా టెక్స్‌టైల్, డైమాండ్స్, రసాయనాలకు చెందిన ఎంఎస్‌ఎంఈలు ప్రభావితం కానున్నాయని హెచ్చరించింది. ‘మొత్తం ఎగుమతుల్లో 45 శాతం వాటా కలిగిన ఎంఎస్‌ఎంఈలను ట్రంప్ టారిఫ్‌లు భారీగా దెబ్బతీయనున్నాయి. టెక్స్‌టైల్స్, డైమండ్స్, కెమికల్స్‌లోని రంగాలు అత్యంత దెబ్బతినే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. ఆగస్టు 27 నుంచి మరో 25 శాతం టారిఫ్ విధించడం ద్వారా 50 శాతానికి చేరుతుంది. ఇది భారత్‌లోని పలు ఎగుమతి రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.” అని క్రిసిల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడించింది. అమెరికాకు భారత దేశ ఎగుమతుల్లో 25 శాతం వాటాను టెక్స్‌టైల్స్, రత్నాలు, ఆభరణాలు కలిగి ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈల్లో 40 శాతం వాటా కలిగిన కెమికల్స్ రంగంలో ప్రతికూల ఇబ్బందులు నెలకొననున్నాయి. భారత్‌లోని ఈ రంగాలకు అమెరికా ప్రధాన వినియోగదారుగా ఉంది. భారత సరుకులపై ట్రంప్ 50 శాతం టారిఫ్‌లను వేయడంతో 48.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులపై ప్రతికూలత నెలకొందని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద ఇటీవల పేర్కొన్నారు. 2024 వాణిజ్య విలువ ప్రకారం.. భారతదేశం నుంచి అమెరికాకు 48.2 బిలియన్ డాలర్ల వస్తువులు ఎగుమతయ్యాయన్నారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఐదు రౌండ్ల చర్చలు జరగ్గా.. ఆరో రౌండ్ కోసం ఆగస్టు 25న అమెరికా బృందం రావాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడింది.
చిన్న పరిశ్రమలకు యూఎస్ టారిఫ్‌ల దెబ్బ
- Advertisement -
- Advertisement -