Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పీడీఎస్యు విద్యార్థి పోరుబాటను విజయవంతం చేయండి

పీడీఎస్యు విద్యార్థి పోరుబాటను విజయవంతం చేయండి

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో నీలం రామచంద్రయ్య భవన్ (ఎన్ ఆర్ భవన్) కోటగల్లి కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్  మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కార దిశగా పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం 25 తేదీ నుండి 30 వరకు జరిగే విద్యార్థి పోరుబాటను విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఫీజుల నియంత్రణ చట్టం లేకపోవడం వలన ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థల్లో లక్షల రూపాయల వసూలు చేస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు, కళాశాలలను నడిపిస్తున్న ,ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయకపోవడం సిగ్గుచేటన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు లేక టీచర్ పోస్టుల ఖాళీల మూలాన విద్య వ్యవస్థ కుంటుపడుతున్నదన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. విద్య బాగు కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగానికి 7 శాతానికి మించి బడ్జెట్ కేటాయించకపోవడం మూలాన ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్నారు. వెంటనే విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నియమించకుండా కాలయాపన చేస్తూ 500 పైగా ఎంఈఓ,28 డిఇఓ పోస్టుల ఖాళీలల మూలాన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసే విద్య అధికారులు లేకపోవడం వల్ల గురుకులాలలు, సంక్షేమ హాస్టల్లో నిత్యం విద్యార్థులు కల్తీ ఆహారంతో  అస్వస్థకు గురవుతున్నారని వాపోయారు. రాష్ట్రంలో 8000 కోట్ల రూపాయల పైగా పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వలన విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారన్నారు. తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

నిజాంబాద్ జిల్లాకు ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు బాల బాలికలకు సొంత వసతిగృహాలు నిర్మించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా నాయకులు నసీర్,వినోద్, సృజన్, వైష్ణవి,నందిని,మహేందర్, మని తేజ,కార్తీక్,విజయ్, మానస తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad