No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంబీహార్ ఎస్ఐఆర్‌పై ఈసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

బీహార్ ఎస్ఐఆర్‌పై ఈసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: బీహార్‌లో 98.2శాతం మంది కంటే ఎక్కువ మంది ఓటర్ల పత్రాలను సమర్పించినట్లు భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) ఆదివారం తెలిపింది. ఇక ఎనిమిది రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉందని వెల్లడించింది.

ఓటర్ల ముసాయిదా జాబితాలో తప్పులసు సరిదిద్దడం మాత్రమే కాకుండా, వారి గణనఫారమ్‌లతో పాటు అవసరమైన పత్రాలను కూడా సమర్పించవచ్చని తెలిపింది. బీహార్‌ సిఇఒ కార్యాలయం సమాచారం ప్రకారం.. జూన్‌ 24 నుండి ఆగస్ట్‌ 24 వరకు, 60 రోజుల్లో 98.2శాతం మంది తమ పత్రాలను సమర్పించినట్లు తెలిపింది. రోజుకు సగటున 1.64శాతం పత్రాలు సమర్పించారని, ఇంకా ఎనిమిదిరోజులు ఉన్నాయని, పత్రాలను సమర్పించేందుకు కేవలం 1.8శాతం ఓటర్లు మాత్రమే మిగిలి ఉన్నారని పేర్కొంది.

ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఆధార్‌ లేదా జాబితా చేయబడిన 11పత్రాలతో దేనినైనా గుర్తింపుపత్రంగా అంగీకరించాని ఇసిని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad