నవతెలంగాణ-హైదరాబాద్: బీసీసీఐ సెలక్షన్ కమిటీ అఫ్గానిస్థాన్‌తో జరగబోయే రాబోయే సిరీస్‌ల కోసం భారత వన్డే, టెస్టు జట్లను అధికారికంగా ప్రకటించింది. 14 మంది సభ్యుల జట్టుకు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ జట్టులో కొనసాగుతున్నారు. అయితే.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు ఈ వన్డే జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు కీపింగ్ బాధ్యతలు చూసుకోనున్నారు. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే వంటి దేశవాళీ ప్రతిభావంతులకు వన్డే జట్టులో పిలుపు లభించింది.
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు పూర్తిగా విశ్రాంతి కల్పించారు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కేవలం టీ20 ఫార్మాట్‌కు మాత్రమే ఫిట్‌గా ఉన్నాడని, అందుకే అతడిని టెస్టు మ్యాచ్‌కు పరిగణనలోకి తీసుకోలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు.
వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
టెస్టు జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్.



