Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి: సీఐటీయూ

జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
తెలంగాణ గ్రామ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మర్రికుంట పాల కేంద్రం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు హనీప్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష. కార్యదర్శి లు ఆర్యన్ రమేష్, మండ్ల రాజు, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి సూర్యవంశం రాములు మాట్లాడుతూ, గ్రామాలలో పారిశుధ్యం మంచినీటి సరఫరా, వీధిలైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితహారం ,పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు తదితర పనులు గ్రామపంచాయతీ కార్మికులతో చేయించుకుంటారు కానీ వారికి నెల నెల వేతనాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఇప్పటికీ జిల్లాలో మూడు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి, పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు, ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని అన్నారు.

మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, ఆన్లైన్లో లేని కార్మికులను వెంటనే ఆన్లైన్లో చేర్చాలని, పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా గుర్తింపు కార్డులు, వారాంతపు సెలవులు పండుగ సెలవులు ఇవ్వాలని, జీవో నెంబర్ 51ని సవరించి క్యాటగిరి లు గా వేతనాలు ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, సబ్బులు నూనెలు ఇవ్వాలని అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు, అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఏవో భాను ప్రకాష్ గారికి అందజేయడం జరిగింది, పై సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిచో పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కోశాధికారి పుష్ప జిల్లా నాయకులు శీను, దాసు, నాగన్న, ఎల్ల స్వామి, నారాయణ, చిన్నమ్మ ,హనుమంతు రంగస్వామి, వివిధ గ్రామాల గ్రామపంచాయతీ కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad