Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ లో వేతనాలు వెంటనే విడుదల చేయాలి..

పెండింగ్ లో వేతనాలు వెంటనే విడుదల చేయాలి..

- Advertisement -

సి ఐ టి యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దాసరి పాండు,కల్లూరి మల్లేశం..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

 పెండింగ్ లో ఉన్న కార్మికుల  వేతనాలు వెంటనే విడుదల చేయాలనీ,కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారిని సీనియారిటీ ప్రకారం పర్మినెంట్ చేయాలని సి ఐ టి యు జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సి ఐ టి యు రాష్ట్ర కమిటి పిలుపులో బాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  సి ఐ టి యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం పేరుతో ప్రభుత్వ రంగంలో ,ప్రైవేట్ రంగంలో సంవత్సరాల తరబడి శ్రమ దోపిడి,వెట్టిచాకిరి చేపిస్తున్నారని సీనియారిటీ ప్రకారం కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.జిల్లాలో అనేక పరిశ్రమలలో కనీస వేతనాలు అమలుకావడం లేదని విమర్శించారు.

20 సంవత్సరాల కు పైగా పనిచేస్తున్న కనీసం పదివేల రూపాయల వేతనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సీనియారిటీ ప్రకారం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతీ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు 10 నెలల నుండి కొన్ని గ్రామలాలో వేతనాలు రాలేదని  రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో వేతనం ఇవ్వడం లేదని వెంటనే పెండింగ్ లో ఉన్న వేతనాలు జిల్లా వ్యాపితంగా విడుదల చేయాలని లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందితే కాంట్రాక్టర్ కార్మికున్ని విధులనుండి తొలగించారని వెంటనే విధులలో కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.మోత్కూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు పీఎఫ్ నెలల తరబడి పెండింగ్లో ఉందని , కనీసం సబ్బులు , డ్రెస్ లు ఇస్తున్న పరిస్థితి లేదని విమర్శించారు.సమస్యలు పరిష్కారం కానియెడల పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు యండి పాషా, గొరిగే సోములు ,జిల్లా సహాయకార్యదర్శులు మాయ కృష్ణ , తుర్కపల్లి సురేందర్, గడ్డం ఈశ్వర్,జిల్లా కమిటి సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, బత్తుల దాసు, రాదారపు మల్లేష్, బందెల బిక్షపతి ,వివిధ రంగాల, పరిశ్రమల నాయకులు జమ్ము రాజశేఖర్,కృష్ణ ,చుక్కల కృష్ణ , మంద యాదగిరి, కూరెళ్ళ కృష్ణ,నకిరేకంటి రాము, శ్రీనివాస్ రెడ్డి, , కొండె నరసింహ, స్వామి,వెంకటేష్, మెటే ఎల్లయ్య,లింగమ్మ,అనిత, రేణుక లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad