Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొట్టి ఇద్దరికీ గాయాలైన సంఘటన మండల పరిధిలోని బొల్లెపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం కే శ్రీను బొల్లేపల్లి గ్రామం జంపల్లి వైపు నుండి బైకుపై  తమ గ్రామం బయలుదేరాడు. అదే సందర్భంలో  మహమ్మద్ గౌస్ చౌటుప్పల్ నుండి భువనగిరి కి బైకుపై బయలుదేరగా, మార్గమధ్యంలో భువనగిరి మండలం సిరివేణికుంట స్టేజి వద్ద ఇద్దరు ఎదురు ఎదురుగా డీ కొని తీవ్ర గాయాలు అయ్యాయి . వీరి ఇద్దరిని చికిత్స నిమిత్తం 108 వలిగొండ అంబులెన్స్ లో ప్రథమ చికిత్స చేసి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు 108 సిబ్బంది ఈఎంటి  స్వరూప, పైలట్  వెంకటేశ్వర్లు తెలిపారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -